కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు
● పొందూరులో ఏజెన్సీ మార్చినా ఇళ్ల వద్దకు సరఫరా కాని వైనం ● ఇబ్బందుల్లో లబ్ధిదారులు
పొందూరు: మండల కేంద్రం పొందూరులో ఇండేన్ గ్యాస్ లబ్ధిదారులకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ ఏజెన్సీని మార్చినా వినియోగదారుల ఇళ్లకు సిలిండర్లు చేరడం లేదు. పొందూరు, జి.సిగడాం, లావేరు, సంతకవిటి, ఎచ్చెర్ల మండలాల్లోని పలు పంచాయతీలకు పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ యే ఆధారం. ఆయా పంచాయతీల్లో సుమారు 28 వేలు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి సుమారు 25 కిలోమీటర్ల పరిధి వరకు కస్టమర్లు ఉన్నారు. వారందరూ పొందూరు ఏజెన్సీకి వచ్చి గ్యాస్ తీసుకెళ్లాల్సిన పరిస్థతి నెలకొంది.
డోర్ డెలివరీ అయ్యేనా...
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు ఆదరాబాదరగా తమ విధి నిర్వహణలకు పరుగులు తీస్తున్నారు. సొంత పనులు చేసుకునేందుకు సైతం సమయం ఉండటం లేదు. ఈ క్రమంలో గ్యాస్ కష్టాలు మరింతగా వెంటాడుతున్నాయి. ఈ నెల 1 నుంచి 10 వరకు గ్యాస్ సిలిండర్లు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 11వ తేదీ నుంచి సరఫరా చేస్తున్నా గోదాము వద్దకు వెళ్లాల్సి వస్తోందని, ఇళ్లకు తెచ్చి ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఈ విషయమై ప్రస్తుత వజ్రపుకొత్తూరు ఏజెన్సీ సిబ్బంది వద్ద ప్రస్తావించగా రెండు రోజుల్లో డోర్ డెలివరీ ప్రారంభిస్తామని చెప్పారు.
తప్పెవరిది..
శిక్ష ఎవరికి?
కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment