శ్రీకాకుళం
దగ్గరకొచ్చారో దూకేస్తా..!
రిమ్స్‌లో ఓ రోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది రక్షించారు. –8లో
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
ఇన్విజిలేటర్‌కు దేహశుద్ధి
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఓ ఇన్విజిలేటర్‌కు దేహశుద్ధి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరగ్గా, గురువారం క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది. వర్సిటీలో.. న్యాయ విద్య ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల పరీక్షలు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం శ్రీకాకుళానికి చెందిన ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైంది. ఇన్విజిలేటర్‌గా వర్సిటీకి చెందిన గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యుడు వ్యవహరించారు. అయితే పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఫోన్ నంబర్‌ను అడిగి తీసుకున్న ఇన్విజిలేటర్ ‘నువ్వంటే నాకిష్టం.. చూసి పరీక్ష రాసుకో.. నీకోసం రూం మొత్తం విడిచి పెడతా’ అంటూ మెసేజ్‌పెట్టాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసి విష యం చెప్పి కాలేజీకి రావాలని సూచించింది. పరీక్ష సాయంత్రం ఐదు గంటలకు అయిపో యాక ఆమె ఇన్విజిలేటర్‌ను తన కుటుంబ సభ్యులకు చూపించింది. దీంతో నలుగురు వ్య క్తులు ఇన్విజిలేటర్‌పై దాడికి దిగారు. అక్కడ ఏం జరుగుతుందో.. ఎందుకు దాడి చేస్తున్నా రో తెలీక విద్యార్థులంతా చూస్తూ ఉండిపోయా రు. తర్వాత వారికి కూడా విషయం తెలిసింది. మెసేజ్ పెట్టిన వ్యక్తి క్షమాపణ చెప్పటంతో అతడిని విడిచిపెట్టారు. అయితే పరీక్ష కేంద్రంలోనికి సెల్‌ఫోన్‌ను అనుమతించడం వల్లే ఈ తంతు జరగడం వర్సిటీలో చర్చనీయాంశమైంది.
టీచర్‌పై ఫిర్యాదు
టెక్కలి రూరల్: మండలంలోని పెద్దసాన గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్న త పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వారి తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.నేతాజీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎంఈఓ దల్లి తులసిరావురెడ్డి ఉన్నతాధికారులకు తెలియజేశారు. డీఈఓ ఎస్.తిరుమల చైతన్య గురువారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులతో సైతం మాట్లాడారు.
కిడ్నీ వ్యాధులపై జాగ్రత్త
శ్రీకాకుళం: కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద జరిగిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మరో ఐదు డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. పలాసలో ఉన్న కిడ్నీ పరిశోధన కేంద్రం (ఆస్పత్రి)లో మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కిడ్నీ వ్యాధిని త్వరగా గుర్తించేందుకు హార్వర్డ్, నార్త్ కెరోలీనా, కొలంబియా సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజి, ఐఏఎస్సీ బెంగళూరు యూనివర్సిటీలతో కలసి పరిశోధనలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు మనిషి జీవన విధానంలో మార్పు రావాలన్నారు. ఎక్కువ నీరు తాగటం, వ్యాయామం చేయటం, ఒత్తిడికి గురికాకుండా ఉండటం, ఏటా పరీక్షలు చేయించుకోవటం వంటి పలు పద్ధతులను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డీసీహెచ్ డాక్టర్ కళ్యాణ్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలమురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం కల్చరల్:
రంగుల వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్‌ను రంగులు ముంచెత్తుతున్నాయి. మరోవైపు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వసంతోత్సవం పేరుతో స్వామికి డోలోత్సవాలు కూడా నిర్వహిస్తారు. దేశంలోనే ఏకై క దేవాలయమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో డోలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందురోజు కామదహనోత్సవం జరుపుతారు. అనంతరం పడియ సందర్భంగా సముద్రస్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఉషా, ఛాయా, ప ద్మినీ సమేత శ్రీసూర్యనారాయణ స్వామి రోడ్డు పక్కనున్న డోలో మండపంలో ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులపైన వసంతం జల్లుతారు. శ్రీకూర్మంలో కూడా ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీకాకుళంలోని ఉమా రుద్రకోటేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో స్వామి ఉత్సమూర్తులను డోలో మండపంలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో సుమా రు 150 కుటుంబా లు ఉన్న మార్వాడీలు ఒకే చోట చేరి హోలీ ఉత్సవాన్ని రాజస్థానీ మిలన్ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
●రక్తచందనం, ఎర్రమందారం, టమాటా, క్యారెట్‌లతో ఎర్రరంగు తయారు చేయవచ్చు. ●గోరింటాకుతో ఆకుపచ్చని రంగు తయారు చేయవచ్చు. ●పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు రంగు చేసుకోవచ్చు. ●మోదుగపూలను నీటిలో నానబెట్టి రంగులను తయారు చేస్తారు.
●గోగుపూలతో బోలెడంత ఎర్రరంగు తయరు చేసుకోవచ్చు.
జాగ్రత్తలు తప్పనిసరి
●హోలీలో సహజమైన రంగులు మాత్రమే వాడాలి.
●రసాయన రంగులు వాడి ప్రమాదం తెచ్చుకోవద్దు.
●హోలీ రంగుల్లో ఉపయోగించే క్రోమియం, సీసం రసాయనాలు క్యాన్సర్ కారకాలు.
●రంగులు విపరీతంగా చల్లుకోవడం వల్ల గాలిలోకి రంగుల సూక్ష్మ కణాలు చేరుతాయి. దాని వల్ల మనకు తుమ్ములు, దగ్గు వచ్చి శ్వాశకోస సంబంధ ఇబ్బందులు వస్తాయి.
●రసాయన రంగులు కళ్లల్లో పడగానే కంటి చికాకు, ఎరుపు, నీరుకారడం, తాత్కాలిక అంధత్వం కలిగిస్తుంది. కళ్లలో పడకుండా జాగ్రత్త పడాలి.
●రంగుల వల్ల కొందరిలో ఎలర్జీ వస్తుంది. వారిని దూరంగా ఉంచాలి.
●హోలీ ఆడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.
●రసాయన రంగుల వలన అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
●మూడు రోజులపాటు..
హిందూ సంప్రదాయంలో ఈ ఉత్సవాన్ని వసంతోత్స వం అని పిలుస్తారు. మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు కామదహనోత్సవం, రెండో రోజు పడి యా సందర్భంగా సముద్రస్నానాలు, మూడో రోజున స్వామిని తోటలోని డోలో మండపంలో ఉంచి ఊయలలో ఊపుతూ డోలోత్సవం నిర్వహిస్తాం.
– ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకులు,
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం
●సహజ రంగులు వాడాలి
కళ్లకు, చర్మానికి ఎలాంటి ప్రమాదం రాకుండా సహజ రంగులు వాడాలి. రసాయన రంగులు కళ్లలో పడితే ఎర్రగా మారి నీళ్లు వస్తాయి. అలాగే చర్మ వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు పాటించాలి.
– ఎంఆర్‌కే దాస్, ఆఫ్తాలమిక్ అధికారి
ప్రశాంతంగా పండగ
చేసుకోండి: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. ఈ మేరకు గురువా రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గొడవలు, అల్లర్ల జోలికి వెళ్లకుండా వేడుకలు జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించినా, ఆకతాయి చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. కలుషితమైన, ప్రమాదకరమైన రంగులు వినియోగించవద్దని పర్యావరణహితమైన రంగులు వాడాలని సూచించారు.
పోర్ట్ నిర్వాసితులకు
ప్లాట్ల కేటాయింపు
టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం మూల పేట గ్రీన్ ఫీల్డ్ ఫోర్ట్ నిర్వాసితులకు ప్లాట్లను టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి లాటరీ ద్వారా గురువారం కేటాయించారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాలకు గాను నౌపడలో 58 ఎకరాల్లో 596 కుటుంబాలకు ప్లాట్లను కేటాయించారు. పోర్టు నిర్మాణంతో గ్రా మాన్ని కోల్పోయిన విష్ణు చక్రం గ్రామస్తులకు ముందుగా 80 మందికి పునరావాస కాలనీలో పాట్లను కేటాయించారు. మరో రెండు నెలల్లో గ్రామాన్ని తరలించాల్సి వస్తుందని, అంతా సహకరించాలని కోరారు. అంతకు ముందు పునరావాస కాలనీలో భూమి పూజ చేశారు.
న్యూస్‌రీల్
ఇంటి వద్దే రంగుల
తయారీ ఇలా..
హోలీ వేడుకకు సర్వం సిద్ధం
దేవాలయాల్లో డోలోత్సవాలు
రసాయన రంగులు వద్దంటున్న నిపుణులు
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment