బెల్ట్‌ బాదుడు | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ బాదుడు

Published Fri, Mar 14 2025 1:07 AM | Last Updated on Fri, Mar 14 2025 1:08 AM

బెల్ట

బెల్ట్‌ బాదుడు

విశృంఖలంగా

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లాలో మద్యం మాఫియా జడలు విప్పింది. లిక్కర్‌ సిండికేట్‌ వ్యవహరం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుట్‌బాటిళ్లుగా వర్ధిల్లుతోంది. జిల్లావ్యాప్తంగా లెక్కకు మించి బెల్టు దుకాణాలు తెరిచారు. ఎమ్మార్పీకి మించి మద్యం ధరలు పెంచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఈ దోపిడీకి అండగా నిలిచినందుకు ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులు అందుతున్నాయి. కొన్నిచోట్ల షాపుకి నెలకు రూ.50 వేలు చొప్పున, మరికొన్ని చోట్ల అక్కడున్న అమ్మకాల దృష్ట్యా రూ.30వేల నుంచి రూ.70వేల వరకు తీసుకుంటున్నారు. పనిలో పనిగా అధికార వర్గాలు కూడా రెన్యువల్‌ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. జనవరిలో జరిగిన రెండో రెన్యువల్‌కు షాపునకు రూ. 70 వేలు వసూలు చేయగా, ఈ నెలలో చేయాల్సిన మూడో రెన్యువల్‌కు రూ.30వేలు అడుగుతున్నాయి.

రూ.10 అదనం

జిల్లాలో బెల్ట్‌షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అన్నీ నేతల కనుసన్నల్లోనే ప్రారంభమయ్యాయి. తమ టర్నోవర్‌ పెరగడం కోసం లైసెన్స్‌ దుకాణాలు బెల్ట్‌షాపులను ప్రోత్సహిస్తున్నాయి. ఒక్కో గ్రామానికి కనీసం 10 బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. ఈ బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేసే బాధ్యతను లైసెన్సు దుకాణాలు తీ సుకుంటున్నాయి. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌కు రూ.10 పెంచి తీసుకోగా, ఆ బెల్ట్‌ షాపుల నిర్వాహకులు మరో రూ.40వేసి రూ. 50 అధికంగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం టౌన్‌, శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురంలో మినహా మిగతా అన్ని చోట్ల బెల్ట్‌షాపులకు ఒక్కో బాటిల్‌పై రూ. 10 పెంచి సరఫరా చేస్తున్నారు.

పలాస నియోజకవర్గంలో బరితెగింపు

పలాస నియోజకవర్గంలోనైతే మద్యం దుకాణాల కౌంటర్‌లో క్వార్టర్‌ బాటిల్‌కు రూ.10 అదనంగా వేసి విక్రయిస్తున్నారు. ఆ మధ్య జామి జాతరలోనైతే ఒక్కో బాటిల్‌కు రూ. 50 పెంచి విక్రయించారు. వాస్తవానికి జాతర సమయంలో దుకాణాలు తెరవకూడదు. కానీ బ్యాక్‌డోర్‌లో మొత్తం తతంగం నడిపేశారు. కీలక నేతల అనుమతి తీసుకుని దర్జాగా షాపుల కౌంటర్లలోనే ఎమ్మార్పీకి రూ.10 పెంచి విక్రయించేస్తున్నారు. ఎవరికెంత ముడుపులందుతున్నాయో గానీ ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గేట్లు ఎత్తేశారు.

తిలాపాపం తలా పిడికెడు

మద్యం దోపిడీలో నేతలు లాభాలు ఆర్జిస్తుంటే.. తామెందుకు వదులుకోవాలని అధికార వర్గాలు సైతం అక్రమ వసూళ్లు చేస్తున్నాయి. కాకపోతే, లైసెన్సుల రెన్యువల్‌ పేరుతో వసూళ్లు చేస్తున్నాయి. జనవరిలో జరిగిన రెండో రెన్యువల్‌కు షాపుకి రూ. 70వేలు వసూలు చేయగా, ఈ నెలలో జరిగే మూ డో రెన్యువల్‌కు ఇప్పటికే రూ. 30వేలు డిమాండ్‌ చేస్తున్నాయి. శాంతిభద్రతలు, మందుబాబుల రాకపోకలు తదితర వ్యవహారాలను కంట్రోల్‌ చేసేందుకు సంబంధిత అధికారులు షాపుకింత అని నెల వారీ ముడుపులు ఇప్పటికే తీసుకుంటున్నారు.

జడలు విప్పిన లిక్కర్‌ సిండికేట్‌

పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్ట్‌షాపులు

నాలుగైదు మండలాల్లో మినహా జిల్లా వ్యాప్తంగా అడ్డగోలు విక్రయాలు

బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నందుకు క్వార్టర్‌ బాటిల్‌కు అదనంగా రూ. 10 వసూలు

పలాస నియోజకవర్గంలోనైతే లైసెన్సు దుకాణాల కౌంటర్లలో క్వార్టర్‌ బాటిల్‌పై రూ. 10 పెంచి విక్రయాలు

దోపిడీకి కీలక నేతల అండ

కీలక నేతలకు ముడుపులు

జిల్లాలో జరుగుతున్న మద్యం దోపిడీపై కీలక నేత ముడుపుల ఒప్పందం కుదుర్చుకున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో షాపుకి నెలకు రూ. 50 వేలు చొప్పున, మరికొ న్ని నియోజకవర్గాల్లో షాపు సామ ర్థ్యం మేరకు రూ.30వేల నుంచి రూ. 70వేలు ఇచ్చేందుకు నిర్ణయాలు జరిగిపోయాయి.

ఇప్పటికే కొన్నిచోట్ల చెల్లింపులు జరిగిపోగా, మరికొన్ని చోట్ల వారం పది రోజుల్లో ఆ మేరకు చెల్లింపులు చేయడానికి సిండికేట్‌ సిద్ధం చేసింది.

ఇక,లైసెన్సు షాపుల కౌంటర్లలోనే క్వార్టర్‌ బాటిల్‌కు రూ.10 పెంచి విక్రయిస్తు న్న చోట ఈ ముడుపులు మరింత ఎక్కువగా ఉన్నాయి.

నెలకి రూ. లక్షకు పైగా ముట్టచెబుతున్న షాపులు కూడా ఉన్నాయి.

శ్రీకాకుళం టౌన్‌, శ్రీకాకుళం రూర ల్‌, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురంలో విక్రయాలకు చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు సిండికేటైన చోట వ్యాపారం టర్నోవర్‌ చూసి ఈ ముడుపులు పెంచే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం 20 శాతాలు లాభాలు ఇస్తే ఈ ముడుపులు మరింత పెరగనున్నాయి. తక్కువ ధరల కు నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దశల వారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ధరలు పెంచేసి మందుబాబులను దోచుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
బెల్ట్‌ బాదుడు1
1/2

బెల్ట్‌ బాదుడు

బెల్ట్‌ బాదుడు2
2/2

బెల్ట్‌ బాదుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement