ఆమదాలవలస రూరల్: మండలంలోని ఇసక లపేట, తొగరాం, కొత్తవలస తదితర గ్రామా ల మీదుగా బలసలరేవు బ్రిడ్జికి నిర్మించనున్న అప్రోచ్ రోడ్డుకు గురువారం జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ స్థల పరిశీలన చేశారు. పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సాయిప్రత్యూష, తహశీల్దార్ రాంబాబు, సర్వేయర్ బి.గోపి, ఆర్‌ఐ పి.గోవిందరావు పాల్గొన్నారు.
గంజాయితో మహిళ అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి తరలిస్తున్న మహిళను గురువా రం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ మొబైల్ సీఐ జి.వి.రమణ తెలిపారు. శ్రీకాకుళం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి తనిఖీలు చేస్తుండగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద రంజువాలిక్ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. తనిఖీ చేయగా 10.3 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీల్లో సిబ్బంది విఠలేశ్వరరా వు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆరు ప్రైవేటు బస్సులు సీజ్
శ్రీకాకుళం అర్బన్: జిల్లా ప్రజారవాణా శాఖ, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువా రం బుడుమూరు, సీపన్నాయుడుపేట తదితర చోట్ల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా అనుమతులు లేకుండా తిరుగుతున్న ఆరు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. కాంట్రాక్ట్ క్యారేజ్‌గా అనుమతులు తీసుకుని స్టేజ్ క్యారేజీలుగా నడుపుతున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులో సీట్లు, నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడాన్ని గమనించి సీజ్ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐలు గంగాధర్, అనిల్, శిరీష, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజ ర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్. ఎస్.శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
టెక్కలి రూరల్: టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సివిల్ సప్లయ్ గోదాము నుంచి బియ్యం తీసుకెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. తొట్టెకు ఉన్న లింకు తెగిపోవడంతో కూలీలు ఒక్కసారిగా గెంతేశారు. అనంతరం అడ్డుగా రాళ్లు పెట్టి తొట్టె వెనుక జారకుండా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బియ్యం బస్తాలను మరో ట్రాక్టర్‌లోకి లోడ్ చేసుకుని వెళ్లారు.
అధికార లాంఛనాలతో
అంత్యక్రియలు
టెక్కలి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఆర్మీ హవల్దార్ పైల ప్రతాప్ రెడ్డి మృతదేహం గురువారం ఢిల్లీ నుంచి స్వగ్రామమైన టెక్కలి చేరుకుంది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్మీ అధికారులు మృతుని కుటుంబసభ్యుల సమక్షంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
అప్రోచ్ రోడ్డుకు స్థల పరిశీలన
అప్రోచ్ రోడ్డుకు స్థల పరిశీలన
అప్రోచ్ రోడ్డుకు స్థల పరిశీలన
అప్రోచ్ రోడ్డుకు స్థల పరిశీలన