శ్రీకాకుళం కల్చరల్: స్థానిక మిలటరీ క్యాంటీన్‌లో లిక్కర్ సెల్ఫ్ సర్వీసును జిల్లా ఎక్స్ సర్వీసు మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. మాజీ సైనికులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు సూచించారు. క్యాంటిన్ మేనేజర్ సుబేదార్ మేజర్ పి.గోవిందరావు అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హానరరీ ప్రెసిడెంట్ బి.సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు, కోశాధికారి ఎం.సింహాచలం, స్పోక్స్ పర్సన్ కె.కన్నారావు, చింతు రామారావు, ఏవీ జగన్మోహనరావు, వీరనాటి పి.భారతమ్మ, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని బాతుపురం–చినవంక ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఒక భారీ మర్రిచెట్టు కొమ్మ రోడ్డుపై విరిగిపడింది. అయితే ఆ సమయంలో వాహన రాకపోకలు, ప్రయాణికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ రోడ్డులో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చెట్టుకొమ్మ రోడ్డుకి అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులంతా కలిసి చెట్టుకొమ్మను తొలగించారు.
మిలటరీ క్యాంటీన్‌లో సెల్ఫ్ సర్వీసు