
ఒడిశా నుంచి ప్రథమ భాష సాహిత్య పుస్తకాలు
కవిటి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒడియా మీడియం విద్యార్థులకు అవసరమైన ప్రథమ భాషా పుస్తకాలు ఒడిశా విద్యాశాఖ నుంచి అందుకున్నామని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(ఒడియా) దుర్గాప్రసాద్ చౌదరి తెలిపారు. సోమవారం ఈ మేరకు బరంపురంలో అందుకున్నామన్నారు. జిల్లాలో ఒడియా మాధ్యమం చదువుతున్న విద్యార్థులకు రూ.2లక్షల విలువ చేసే 9,10 వ తరగతి సంబంధించి ప్రథమ భాష ఒడియా సాహిత్య సింధు 1270 పుస్తకాలు, సాహిత్య ధారా 1250 పుస్తకాలు, ఒడియా వ్యాకరణం 2520 పుస్తకాలు ఒడిశా ప్రాంతీయ మాధ్యమిక బోర్డు బరంపురం జోన్ జాయింట్ సెక్రటరీ సుభాష్ చంద్ర బెహరా ఉత్తరాంధ్ర ఒడియా డీఐ దుర్గా ప్రసాద్ చౌధురీకి సోమవారం బరంపురం ప్రాంతియ మాధ్యమిక బోర్డు కార్యాలయంలో అందజేశారు.