
విన్నపాలు విన్నారు
● మీకోసంకు 154 దరఖాస్తులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ‘మీ కో సం‘ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 154 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, వాటిలో కొన్ని సమస్యల ను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన అంశా లను సంబంధిత శాఖలకు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సైరిగాంలో ప్రభుత్వ చెరువుల ఆక్రమణలు
టాస్క్ ఫోర్స్: సైరిగాం గ్రామంలో ప్రభుత్వ చెరువులు ఆక్రమణలకు గురువుతున్నాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముద్దాడ శ్రీనివాసరావు ఈ ఆక్రమణలు చేస్తున్నాడని గ్రామ సర్పంచ్ ధర్మాన అనితతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్మాన వెంకటరమణ మూర్తి, పొన్నాన ముసలినాయుడు, కొర్ను నారాయణరావు తదితరులు సోమ వారం ప్రభుత్వ కార్యదర్శితోపాటు డీఆర్‌ఓకు ఫిర్యాదు చేశారు. సైరిగాం పంచాయతీలో ఊరి గుండం చెరువులో సర్వే నంబరు 90లో 7.24 ఎకరాలు ఉండగా ఇందులో పలువురు రైతులకు డీ పట్టాలు ఇచ్చారు. ఇదే చెరువులో మట్టిని యంత్రాలతో తవ్వకాలు జరిపి ట్రిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని పెరిగించి ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న అచ్చెప్ప చెరువును కప్పుతున్నారని వారు పేర్కొన్నారు. తన సోదరుడు ముద్దాడ రవి చంద్ర సీఎం కార్యాలయంలో ముఖ్య హోదాలో పని చేయడంతో ఆయన పేరు చెప్పి ఈ ఆక్రమణలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఇదే వి ధంగా పాపమ్మ కోనేరు, భూసమ్మకోనేరు, శోభనాద్రి చెరువు, ఉప్పరవాని చెరువు, మంగళివాని చెరువు, గాది బంద చెరువు తదితరవి దురాక్రమణ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై స్థానిక తహసీల్దార్‌కు రెండు రోజు ల కిందట ఫిర్యాదు చేస్తే.. రెండు రోజులాగి మళ్లీ ఆక్రమణలు కొనసాగిస్తున్నారని తెలిపారు.
79 ఫిర్యాదుల స్వీకరణ
శ్రీకాకుళం క్రైమ్: సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కు 79 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో అదనపు ఎస్పీ (అడ్మిన్) కేవీ రమణ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయి లో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీ సు అధికారులు ఫోన్ కాల్స్ ద్వారా తక్షణమే తెలియపరచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

విన్నపాలు విన్నారు

విన్నపాలు విన్నారు