భానుడు భగభగ
భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయ్. వేసవి కాలం ప్రారంభమైన కొద్దికాలానికే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. మరో రెండునెలల పాటు వేసవి కాలం ఉండగా.. ప్రస్తుత ఉష్ణోగ్రతలను చూస్తే జనం బిత్తరపోతున్నారు. మూడు రోజులుగా జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండల తీవ్రత అధికంగా ఉంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలను దాటాయి. ఈ ఎండలు గతేడాదితో పోల్చితే ఎక్కువగానే ఉన్నాయి. బుధవారం జిల్లాలోని పది ప్రాంతాల్లో 37 డిగ్రీలకు పైగా, మరో 4 ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లతో పాటు ఆఫీసుల్లో వేసవి నేస్తాలను సమకూర్చుకుంటున్నారు. ఎండలు ముదరడం.. వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావులులో జలాలు తగ్గిపోయి చాలావరకు పొలాలు ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
సాధారణానికి మించి..
జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. ఏప్రిల్, మే మాసాల్లో ఈ ఎండల తీవ్రత అధికంగా నమోదవుతూ ఉంటుంది. మార్చి రెండోవారం నుంచి 35 డిగ్రీలకు చేరుకుని ఆ తర్వాత 40లకు అటుఇటుగా నమోదవుతుంది. ఈనెల 4న ఏకంగా 39.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. అంతకు ముందు వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండలు ఉన్నాయి. ఈ నెల 1వ తేదీన 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2వ తేదీన రెండు డిగ్రీలు పెరిగి 35 డిగ్రీలు, 3న మరో రెండు డిగ్రీలు పెరిగి 37కు చేరింది. 4వ తేదీన ఏకంగా 40 డిగ్రీలకు చేరువై 39.9 డిగ్రీలుగా నమోదైంది. బుధవారం నాలుగు మండలాల్లో 38.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండలను చూసిన జనం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనన్న భయంతో ఉన్నారు.
ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో..)
ఫ మూడురోజులుగా
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఫ బుధవారం నాలుగు ప్రాంతాల్లో
38 డిగ్రీలకుపైగా నమోదు
ఫ గతేడాదితో పోల్చితే
ముందుగానే మండుతున్న ఎండలు
భానుడు భగభగ
భానుడు భగభగ
భానుడు భగభగ
Comments
Please login to add a commentAdd a comment