ఒకరి ప్రేమ.. మరొకరి అహం.. | - | Sakshi
Sakshi News home page

ఒకరి ప్రేమ.. మరొకరి అహం..

Published Tue, Mar 11 2025 2:04 AM | Last Updated on Tue, Mar 11 2025 2:04 AM

ఒకరి ప్రేమ.. మరొకరి అహం..

ఒకరి ప్రేమ.. మరొకరి అహం..

ప్రణయ్‌ హత్యతో రెండు కుటుంబాల్లోనూ విషాదం

సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఒకరి ప్రేమ.. మరొకరి అహం.. ఆ కుటుంబాలను చెల్లాచదురు చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని బలితీసుకోగా, చివరకు ఆ తండ్రే తనకు తానే తనువు చాలించాడు. అదే ప్రణయ్‌, అమృత వర్షిణి ప్రేమ వ్యవహారంలో చివరి మజిలీగా మిగిలింది. మిర్యాలగూడ పట్టణంలో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రేమించుకున్న వారిద్దరు 2018 జనవరి 30న ఒక్కటయ్యారు. కొద్దిరోజులకే ఆమె కడుపులో మరో జీవి ప్రాణం పోసుకుంది. అయినా ఆమె తండ్రి తిరునగరు మారుతీరావు పరువు.. ప్రతిష్ట అంటూ అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయించి కూతురు జీవితాన్ని చీకటిమయం చేశారు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించుకుని ఎన్నో ఆశలతో ఒక్కటైన ప్రణయ్‌ అమృతవర్షిణి కలల ప్రపంచం చెదిరిపోయింది. వృద్ధాప్యంలో అండగా ఉంటాడని అనుకున్న ప్రణయ్‌ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు ప్రణయ్‌ హత్య తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రణయ్‌ హత్య, మారుతీరావు ఆత్మహత్యతో ఆ రెండు కుటుంబాలు అగాథంలో పడ్డాయి.

కడుపుతో ఉన్నా కరుగని మనస్సు..

కూతురు గర్భతిగా ఉన్నా ఆ తండ్రి మనస్సు కరుగలేదు. అల్లుడిగా ప్రణయ్‌ని అంగీకరించకపోయినా, పట్టించుకోకుండా వదిలేసినా సరిపోయేది. కానీ పరువు పేరుతో ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావుతోపాటు హత్యలో భాగస్వాములైన ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ తరువాత అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండేళ్లు కాలం గడిచింది. తన భర్త మరణానికి న్యాయం కావాలని, తండ్రికి మరణ శిక్ష పడాలని కన్న కూతురే డిమాండ్‌ చేయడంతో మారుతీరావు మనోవేదనలో పడ్డారు. 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫ కలలు చెదిరిపోయి, ఊరు విడిచి వెళ్లిపోయిన అమృత

ఫ కొడుకు లేక విలపిస్తున్న ప్రణయ్‌ తల్లిదండ్రులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement