
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం
సూర్యాపేటటౌన్ : జిల్లాల్లో శాంతిభద్రతల రక్షణకు అధికప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నూతన ఎస్పీ కె.నర్సింహ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతన ఎస్పీగా ఆయన సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గత ఎస్పీ, డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్పీకి అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పేకాట, గంజాయి తరలింపు, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు.
వేగంగా పోలీస్ సేవలు
ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి విలువైన సేవలు వేగంగా అందిస్తామన్నారు. మహిళల పట్ల, పిల్లల పట్ల వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవ్‌టీజింగ్ చేసే వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. సైబర్ మోసాల పై ప్రణాళికతో పని చేస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.
ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నర్సింహ
Comments
Please login to add a commentAdd a comment