
అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగినందున ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని మందులు, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని పాఠశాలు, హాస్టల్స్‌లో ఫ్యాన్లు వాడుకోనేలా సిద్ధం చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి ఎద్దడి రాకుండా చిన్నచిన్న మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా శాఖ సభ్యులు తల్లిదండ్రుల వయోధికుల పోషణ, సంక్షేమ చట్టం 2007 నియమావళి – 2011 తెలిపే పోస్టర్‌ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, సీపీఓ ఎల్.కిషన్, డీఎంహెచ్‌ఓ కోటాచలం, డీఈఓ అశోక్, డీటీడీఓ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మైనార్టీ అధికారి జగదీశ్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ పీడీ శ్రీనివాస్‌నాయక్, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం నాయక్, డీఎస్‌ఓ రాజేశ్వరరావు, డీసీఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, మెప్మా పీడీ రేణుక పాల్గొన్నారు.
సాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పాల్గొని మాట్లాడారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరందేలా చూస్తామన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment