
ఖేలో ఇండియా పోటీలకు అవకాశం కల్పించాలి
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖేలో ఇండియా, జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవికి ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్‌కుమార్ నేతృత్వంలో వినతి పత్రం అందజేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణాలను జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. క్రీడా ప్రాంగణాల ప్రత్యక్ష పరిశీలన కోసం ఎంజీ యూనివర్సిటీని సందర్శించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట స్పోర్ట్స్ బోర్డ్ సభ్యులు ప్రొఫెసర్ సోమలింగం, శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ రమావత్ మురళి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment