
గిరిజన రైతులకు నాబార్డు చేయూత
దేవరకొండ: నాబార్డు(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. నాబార్డు మంజూరు చేస్తున్న నిధులతో గిరిజన రైతులు జలసంరక్షణ పనులతో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. దేవరకొండ మండల పరిధిలోని ధర్మతండా, సపావట్‌తండా, గొల్లపల్లి, వెంకట్‌తండాను ఐదేళ్ల కిత్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాబార్డు డబ్ల్యూడీఎఫ్ (వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ఫండ్) ఆయా గ్రామాల్లో భూ అభివృద్ధి పనులు చేపట్టింది. తద్వారా ఇక్కడ ఏర్పాటైన వాటర్‌షెడ్ కమిటీలు రైతుల కోసం వివిధ పనులకు సబ్సిడీలు మంజూరు చేస్తూనే తండాల వాసుల ఉపాధి కల్పనకు కూడా బాటలు వేశాయి.
నాలుగు గ్రామాల్లో చేపట్టిన పనులు..
● నాబార్డు ఎంపిక చేసిన ధర్మతండా, సపావట్‌తండా, గొల్లపల్లి, వెంకట్‌తండాల్లో అర్హులైన రైతుల పొలాల్లో మొదటగా లోతట్టు ప్రాంతాల్లో నీరు వృథాగా పోకుండా రాతి కట్టడం, ఫాంపాండ్స్, సంకెన్ పిట్స్, వరద కట్టల నిర్మాణాలు చేపట్టారు.
● నీటి నిల్వలు తగ్గకుండా చూడడం, బోరు రీచార్జ్ కావడం వంటి జలసంరక్షణ పనులు చేశారు.
● ఈ నాలుగు తండాల్లోని 1,100 హెక్టార్ల భూములకు సంబంధించి అర్హులైన రైతులను ఎంపిక చేసి నాబార్డు సహకారంతో యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ(ఏఆర్‌డీఎస్) ఆధ్వర్యంలో స్ప్రింక్లర్లు, పైపులు, డ్రిప్‌లు అందించారు.
● దొండ సాగుకు పందిళ్ల ఏర్పాటు, రైతుల పొలాలకు పైప్‌లైన్ వంటి పనులు చేపట్టి ప్రోత్సహించారు.
● నిధుల విషయంలో రైతుల వాటా 30శాతం ఉండగా నాబార్డు 70శాతం నిధులు మంజూరు చేసింది.
● మొత్తంగా ఐదేళ్లలో గిరిజన రైతుల పొలాల్లో అభివృద్ధి పనులకు నాబార్డు రూ.80లక్షలు మంజూరు చేసింది. దీంతో గిరిజనులు వివిధ పంటలతో పాటు కూరగాయల సాగు చేస్తూ కొంతమేర ఆర్థిక స్వావలంబన సాధించారు.
ఫ దేవరకొండ మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో డబ్ల్యూడీఎఫ్
నిధులతో భూ అభివృద్ధి పనులు
ఫ ఏఆర్‌డీఎస్ ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్లు, పైప్‌లు, డ్రిప్‌లు అందజేత
ఫ ఉపాధికి బాటలు వేస్తున్న
వాటర్‌షెడ్ కమిటీలు
Comments
Please login to add a commentAdd a comment