
రిటైర్డ్ ఉద్యోగుల గొంతుకనవుతా
అయ్యా.. నీళ్లులేక పంటలు ఎండిపాయ్
కలెక్టర్‌ను కలిసిన నూతన ఏజీపీ
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట సీనియర్ సివిల్ జడ్జ్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో నూతన ఏజీపీ (అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ )గా నియమితులైన ఎండి షఫి ఉల్లా మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టులో సివిల్ వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వానికి కక్షిదారులకు మధ్యవర్తిగా ఉంటూ భూసమస్యల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సూర్యాపేట బార్ అసోసియేషన్ కార్యదర్శి డప్పుకు మల్లయ్య, సీనియర్ న్యాయవాది సీనేపల్లి సోమేశ్వర్, జూనియర్ న్యాయవాది పల్లా పరమేష్ ఉన్నారు.
సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలి
సూర్యాపేటటౌన్ : ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించే జిల్లా ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట, హుజూర్‌నగర్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సన్నాహక సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
చివరి విడత గోదావరి జలాల పునరుద్ధరణ
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు గోదావరి జలాలను చివరి విడతగా మంగళవారం పునరుద్ధరించారు. ఈ విడతలో వారబందీ విధానం ద్వారా సోమవారమే గోదావరి జలాలను పునరుద్ధరించాల్సి ఉంది. కానీ ఒకరోజు ఆలస్యంగా నీటిని విడుదల చేశారు. తొలిరోజు 750 క్యూసెక్కులను జిల్లాకు వదిలారు. ఈ నీటి సామర్థ్యాన్ని అంచెలంచెలుగా రెండు రోజుల్లో పెంచనున్నట్లు నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ నీళ్లు ఈ నెల 24 వరకు జిల్లాకు రానున్నాయి. పంటలు మరో 20రోజుల్లో చేతికందనున్నాయని అప్పటి వరకు గోదావరి జలాలను కొనసాగించాలని అన్నదాతలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
డీఎల్‌ఎస్‌ఏ సభ్యులుగా మధు, వెంకటేశ్వర్‌రావు
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) సభ్యులుగా సీనియర్ న్యాయవాదులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్‌రావులను నియమిస్తూ తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండు సంవత్సరాల పాటు వీరు సేవలు అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్ శ్రీ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
చరిత్రలో నిలిచిపోయే రోజు
భానుపురి (సూర్యాపేట) : అసెంబ్లీలో విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందడం చరిత్రలో నిలిచిపోయే రోజుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంప్రభు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిల్లులను ఆమోదించడం పట్ల ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అది ఆమోదం పొందే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేయడంసంతోషకరమని పేర్కొన్నారు.
కోదాడ: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య తాను వారధిగా ఉండడంతో పాటు శాసన మండలిలో రిటైర్డ్ ఉద్యోగుల గొంతుకనవుతానని తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పింగిలి శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని పబ్లిక్‌క్లబ్ ఆవరణలో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు పదుల వయస్సులో కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పెన్షనర్లు క్రీడా పోటీల్లో తలపడడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధించే వరకు పోరాడుతానన్నారు. పీఆర్‌సీ, డీఏల పెండింగ్ బిల్లుల విషయం కూడా తాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు, చంద్రశేఖర్, ఉమా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రెడ్డి, బొల్లు రాంబాబు, జితేందర్‌రెడ్డి, తీగల నరేష్, వీరబాబు, అక్కిరాజు వెంకట్రావ్, భ్రమరాంబ, రఘు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
మూడురోజులుగా కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల క్రీడా పోటీల్లో షటిల్‌లో ప్రథమస్థానంలో కామారెడ్డి జిల్లా, ద్వితీయ స్థానంలో నిజామాబాద్ జిల్లా, టెన్నికాయిట్‌లో సూర్యాపేట జిల్లా ప్రథమస్థానం, యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయస్థానంలో నిలిచాయి. క్యారమ్స్‌లో కామారెడ్డి ప్రథమ, ఖమ్మం జిల్లా ద్వితీయస్థానంలో నిలిచింది. చెస్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా ప్రథమ, కరీంనగర్ జిల్లా ద్వితీయస్థానంలో నిలిచింది. మహిళా వాకింగ్ పోటీల్లో ప్రథమస్థానంలో జనగామ, ద్వితీయస్థానంలో సూర్యాపేట జిల్లా నిలిచింది. మ్యూజికల్ చైర్ విభాగంలో కూడా ప్రథమస్థానంలో జనగామ, ద్వితీయస్థానంలో సూర్యాపేట జిల్లా నిలిచింది.
ఫ శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి
ఫ 18 మంది సభ్యుల నియామకం
ఫ పాలక మండలికి రెండేళ్ల పదవీ కాలం
ఫ శాశ్వత సభ్యునిగా ఫౌండర్ ట్రస్టీ
న్యూస్‌రీల్
ఫ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
ఫ ముగిసిన రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు

రిటైర్డ్ ఉద్యోగుల గొంతుకనవుతా

రిటైర్డ్ ఉద్యోగుల గొంతుకనవుతా

రిటైర్డ్ ఉద్యోగుల గొంతుకనవుతా

రిటైర్డ్ ఉద్యోగుల గొంతుకనవుతా
Comments
Please login to add a commentAdd a comment