
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోంది
కోదాడ: ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర కృషిచేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కోదాడకు చెందిన రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండీ జబ్బార్ నివాసంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొని మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకు చెందిన మైనార్టీల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు తెలిపారు. కోదాడలో ఈద్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేయంచానని పేర్కొన్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లింలకు స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేని బాబు, పారా సీతయ్య, అల్తాఫ్ హుస్సేన్, మునావర్, కందుల కోటేశ్వరరావు, బాగ్దాద్, బాజాన్, కేఎల్‌ఎన్. ప్రసాద్, ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment