
లీలావతికి సీ్త్రశక్తి జాతీయ పురస్కారం
హుజూర్‌నగర్‌రూరల్: హుజూర్‌నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతికి సీ్త్రశక్తి జాతీయ పురస్కారం లభించింది. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా లీలావతి చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి ఆమెకు సీ్త్రశక్తి జాతీయ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మీనగ గోపిబోయ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అశ్వవాహన సేవ
మేళ్లచెరువు: మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని మైహోం సిమెంట్ పరిశ్రమలో గల శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి 27వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఐదో రోజు తిరువీధి ఉత్సవం, అశ్వవాహన సేవ, దోపోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో త్రిదండి రామానుజ చినజీయర్ స్వావి, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు,శ్రీకుమారి దంపతులు, మునగాల రామ్మోహన్‌రావు,అరుణ దంపతులు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
భువనగిరి: చేయని తప్పుకు నింద మోపారని మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కాపురం గ్రామానికి చెందిన ఎలకొండ సంజీవరెడ్డి కుమారుడు నవీన్‌రెడ్డి(45) సంజీవరెడ్డి సోదురుడి బావి వద్ద పైపులైన్ పగులగొట్టాడని శనివారం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తాను పైపులైన్ పగులగొట్టలేదని నవీన్‌రెడ్డి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తన బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని, తన బంధువులు తప్పుడు ఆరోపణ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫోన్‌తో మెసేజ్ పెట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.

లీలావతికి సీ్త్రశక్తి జాతీయ పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment