ఈ సంవత్సరం మిర్చిపంట సాగు చేయడం దండుగలా మారింది. పెట్టుబడితోపాటు కూలీల ఖర్చులు పెరిగాయి. దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. పండిన పంటలో సగానికిపైగా తాలుకాయలు వస్తున్నాయి. తాలుకాయలకు సగం ధర కూడా రాదు. దీంతో పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది.
– బానోతు రోజా, సండ్రల్‌తండా,
ఆత్మకూర్(ఎస్) మండలం
ఆటో చార్జీలు భరించాల్సి వస్తోంది
ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చిసాగు చేశాను. పె ట్టుబడులు విపరీతంగా పెరి గాయి. గతంలో ఎకరం పంటను ఏరడానికి 50మంది కూలీలు సరిపోయే వారు. ప్ర స్తుతం 70మంది అవసరం అవుతున్నారు. స్థానికంగా కూలీలు దొరక్క వేరే గ్రామాల నుంచి తీసుకురావడానికి ఆటో చార్జీలు భరించాల్సి వస్తోంది.
–ఆడెపు ఉప్పయ్య,
శెట్టిగూడెం, ఆత్మకూర్(ఎస్) మండలం
సగం వరకు తాలుకాయలే..