సూర్యాపేటటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా పలువురు బాధితులు ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా వారి ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.
పదో తరగతి పరీక్షకు 28 మంది గైర్హాజరు
సూర్యాపేటటౌన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం మూడో రోజు 67 కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 11,997 మంది విద్యార్థులకు గాను 11,871 మంది హాజరు కాగా 26 మంది గైర్హాజరైనట్లు డీఈఓ అశోక్ తెలిపారు. నలుగురు ప్రైవేట్ విద్యార్థులకు గాను ఇద్దరు హాజరు కాగా ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను స్టేట్ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్, సమగ్ర శిక్షా అధికారి రాధారెడ్డి తనిఖీ చేశారు. అలాగే స్క్వాడ్ బృందాలను పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు డీఈఓ తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై అధ్యయనం
గరిడేపల్లి : జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు అధ్యయనం చేస్తున్నట్లు జిల్లా రోడ్డు రవాణాశాఖ అధికారి సురేష్‌రెడ్డి వెల్లడించారు. జాతీయ రహదారి 167పై తరచూ ప్రమాదాలు జరిగే గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట స్టేజీ, అబ్బిరెడ్డిగూడెం క్రాస్ రోడ్డు వద్ద గల ప్రాంతాలను ఆయన నేషనల్ హైవే ఏఈ నవీన్, ఎస్‌ఐ చలికంటి నరేష్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదాలకు దారి తీస్తున్న ప్రధాన కారణాలను వారు అధ్యయనం చేశారు. అతి వేగం, అశ్రద్ధగా వాహనాలు నడపడం, రహదారి మలుపులు, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి అంశాలను విశ్లేషించారు. వాహనదారులకు అవగాహన కల్పించడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రహదారి సరిగా కనిపించేలా లైటింగ్ ఏర్పాట్లు చేయడం, వేగ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
సీపీఐ బలోపేతానికి కృషి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : సీపీఐ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పట్టణ, మండల కౌన్సిల్ సమావేశాన్ని జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ఎన్నికై న నెల్లికంటి సత్యంను ఘనంగా సన్మానించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రాంతానికి చెందిన సీపీఐ నాయకుడు నెల్లికంటి సత్యంను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న నెల్లికంటి సత్యం, బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉస్తేల సృజన, దొడ్డా నారాయణరావు, కేవీఎల్, అనంతుల మల్లేశ్వరి, రాములు, ధనుంజయ నాయుడు, నారాయణరెడ్డి, యాదగిరి, వెంకటేశ్వర్లు, శ్రీను, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, హనుమంతరావు, గుండు వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బాధితులకు అండగా ఉంటాం : ఎస్పీ