తమిళనాడు: సంగోటై సమీపంలోని వినాయకస్వామి ఆలయంలో ఓ కాకి గంటను మోగిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తెన్‌కాశీ జిల్లా సెంగోటై సమీపంలోని చెరువు వద్ద గణేశుని ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బుధ, శనివారాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే భక్తులు సందర్శిస్తారు. ఈ రెండు రోజులు పూజారి ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు.
అయితే మిగిలిన రోజుల్లో ఓ కాకి గంట కొడుతుండాడాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై గుడి సమీపంలో టీ దుకాణం నడుపుతున్న శివకుమార్ మాట్లాడుతూ.. పూజలు జరిగే ఆ రెండు రోజులు కాకుండా మిగిలిన ఐదు రోజులు ఉదయం 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు గుడి ముందు గంటను కాకి మోగిస్తోందని తెలిపారు.
తొలుత తాము పెద్దగా పట్టించుకోలేదని.. అయితే వారంలో పూజలు జరగని ఐదు రోజులు మాత్రమే కాకి వచ్చి గంట కొట్టడం గమనించామన్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment