
నిర్వాహకులు, జ్యూరీ సభ్యులతో అవార్డు గ్రహీతలు
తమిళసినిమా: సినిమా రంగంలో ప్రతిభకు కొరత లేదు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ప్రయత్నాలు చేయడానికి ఈ తరం రెడీగా ఉంది. అయితే అలాంటి వారికి ప్రోత్సాహం ఉంటే అద్బుతాలు చేయడానికి యువతరం సిద్ధం. అలాంటి వారిని ప్రోత్సహించే విధంగా మూవీ బఫ్, టర్మెరిక్ సంస్థలు బిగ్‌షార్ట్స్ పేరుతో షార్ట్ ఫిలింస్ పోటీలను నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే రెండు సీజన్లను నిర్వహించిన ఈ సంస్థలు తాజాగా బిగ్‌షార్ట్స్ సీజన్ 3 విన్నర్, రన్నర్ల జాబితాను బుధవారం వెల్లడించారు. దీనికి సంబందించిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో నెల్లియన్ కరుప్పయ్య దర్శకత్వం వహించిన బీ లక్ కుట్టిపయ్య అనే షార్ట్ ఫిలిం ప్రథమ బహుమతిని గెలుచుకుంది. అందుకు గానూ ఆ దర్శకుడు కూ.5 లక్షల నగదు బహుమతిని గెలుచుకోవడంతో పాటు, టెర్మెరిక్ మీడియా సంస్థ నిర్మించనున్న చిత్రాల కథా చర్చలో పాల్గొనే అవకాశాన్ని, శిక్షణ నిచ్చే అవకాశాన్ని పొందారు. అదేవిధంగా ఈ పోటీల్లో మొదటి రన్నర్ అప్‌గా అన్బుడెన్ అనే షార్ట్ ఫిలిం నిలిచింది. దీనికి విఘ్నేశ్ వడివేల్ దర్శకత్వం వహించారు.
రెండవ రన్నర్ అప్‌గా రెండు అనే షార్ట్ ఫిలిం నిలిచింది. దీనికి పవన్ అలెక్స్ దర్శకత్వం వహించారు. కడవులే అనే షార్ట్ ఫిలిం మూడవ రన్నర్ అప్ అవార్డును గెలుచుకుంది. దీనికి బాలభారతీ దర్శకత్వం వహించారు. బాలాజీ నాగరాజన్ దర్శకత్వం వహించిన ది స్పెల్ అనే షార్ట్ ఫిలిం నాలుగవ రన్నరప్‌గా నిలిచింది. వీటిలో తొలి రన్నర్‌గా నిలిచిన షార్ట్ ఫిలిం రూ.3 లక్షల నగదు బహుమతిని, రెండవ రన్నర్ అప్‌గా నిలిచిన షార్ట్ ఫిలింకు రూ.2 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నాయి.
మూడు, నాలుగ స్థానాల్లో నిలిచిన షార్ట్ ఫిలింస్ తలా రూ.30 వేల విలువైన వోచర్లను గెలుచుకున్నాయి. కాగా ఈ అవార్డుల కార్యక్రమానికి దర్శకుడు ఎస్‌యు.అరుణ్‌కుమార్, హలితా షమీమ్, కార్తీక్ సుబ్బరాజ్, ఆర్‌కే.సెల్వ, పిలోమిన్‌రాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఛాయాగ్రహకుడు తేనీ ఈశ్వర్, విశ్లేషకుడు శ్రీధర్ పిళ్‌లై జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment