తిరువొత్తియూరు: సేలం జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. దీంతో బంధువులు ఆందోళన చేపట్టారు. అధికారులు స్పందించి ప్రైవేట్ ఆస్పత్రికి సీలు వేశారు.
వివరాల ప్రకారం.. జలగంఠాపురం సౌరియూర్ ప్రాంతానికి చెందిన భూపతి భార్య సంగీత (28). ఈ దంపతులకు 11 ఏళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సంగీత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి 20 రోజులకు ముందు ఎడప్పాడిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చా రు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన సంగీతకు 2 వారాల తర్వాత తరచూ కడుపునొప్పి రావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకెళ్లా రు. డాక్టర్లు ఆమె కడుపులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి ఆమెకు రెండవ సా రి ఆపరేషన్ చేశారు.
తర్వా త ఇంటికి వెళ్లి మాత్రలు వేసుకున్న సంగీత ఆదివారం అస్వస్థతకు గురైంది. మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లాగా అక్కడ మూడోసారి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉద యం సంగీత ఆమె మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సంగీత చనిపోయిందని ఆరోపిస్తూ.. బంధువులు రాత్రి ధర్నాకు దిగారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో సిబ్బంది లెనిన్ సంగీత మృతదేహాన్ని సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిని సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి
Comments
Please login to add a commentAdd a comment