చెన్నై,తిరువొత్తియూరు: విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకున్న మహిళ హఠాత్తుగా మృతి చెందారు. దీంతో ఆమె బంధువులు ఆగ్రహించి ఆందోళన చేశారు. విక్రవాండి సమీపంలోని తొరవి గ్రామానికి చెందిన కేశవేల్(38) కూలీ కార్మికుడు. అతని భార్య రామాయి (32). ఆమెను గత 10వ తేదీ ప్రసవం కోసం విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు సిజేరియన్ ద్వారా ఆడబిడ్డ జన్మించింది. తరువాత అక్కడ చికిత్స పొందుతున్న రామాయికి కొన్ని రోజులకు ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు.
దీని తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామాయికి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం గత 20వ తేదీ ముండియంబాక్కంలో వున్న విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్లు చేసిన వైద్యం ఫలించక సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ సంగతి తెలుసుకున్న రామాయి బంధువులు వైద్యు ల నిర్లక్ష్యం వలనే బాలింత మృతి చెందారని ఆరోపిస్తూ ఆసుపత్రికి ముట్టడి చేసి ఆం దోళన చేశారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసు సూపరిన్‌టెన్‌డెంట్ జ యకుమార్, డిప్యూటీ పోలీసులు తిరుమా ల్ తదితరులు అక్కడికి చేరుకుని వారిని సమాధానం చెప్పి ఆందోళన విరమింపచేశారు.
Comments
Please login to add a commentAdd a comment