సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో కొత్తగా 40 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా హైదరాబాద్‌లో దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడి మల్కాపూర్, ఫిలింనగర్, మధురానగర్, మాసబ్ ట్యాంక్, బోరబండ.. సైబరాబాద్‌లో మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూర్, జినోమ్‌వ్యాలీ పోలీస్‌స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయనుంది.
అలాగే కొత్తగా 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు, రెండు టాస్క్‌ఫోర్స్ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు ఆరు డీసీపీ జోన్‌లు, ప్రతి ఏరియాలో సైబర్‌క్రైమ్, నార్కోటింగ్ వింగ్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా మేడ్చల్, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ జోన్లుగా నిర్ణయించారు. అదే విధంగా హైదరాబాద్‌లో 12 ఏసీపీ డివిజన్లు, సైబరాబాద్‌లో మూడు డీసీపీ జోన్ల ఏర్పాటు చేయనున్నట్లు జీవీలో పేర్కొన్నారు. ప్రతి జోన్‌కు ఒక మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ బిచ్చగాళ్లలా అడుకుంటున్నారు: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment