
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితు లున్నట్లు సోషల్ మీడియాలో ఎవరూ అవాస్తవ ప్రచారం చేయొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ‘భారతీయులను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నా మాటగా చెప్పండి’ అని మోదీ తమకు స్పష్టంగా చెప్పారన్నారు. ఉక్రెయిన్‌లో 20 వేలకు పైగా ఉన్న భారతీయులు పడుతున్న ఇబ్బందులను తాను, ఇతర నేతలు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సంజయ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment