సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వల్ల ప్రపంచమంతా గందరగోళంగా తయారై, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు దిగజారిన వేళ తెలంగాణ లో ప్రజల తలసరి ఆదాయం పెరిగినట్టుగా చూపిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావును అభినందిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఇది ఎలా సాధ్యమైందో, అప్పులనే ఆదాయంగా చూపారా? మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన బడ్జెట్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవబోతోందా? అని బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొంటూ రఘునందన్‌రావు పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పులు రూ. 2.45 లక్షల కోట్లుగా ఉందని, ప్రస్తుతం బడ్జెట్ కాలమయ్యేసరికి అది రూ. 3.5 లక్షల కోట్లకు చేరుకోనుందన్నారు. 2019–20లో రూ.45,740 కోట్ల అప్పు, దాని మీద వడ్డీ రూ.14,386 కోట్లు చెల్లించినట్టు చూపిన ప్రభుత్వం, ప్రస్తుత బడ్జెట్‌లో తీర్చాల్సిన అప్పును రూ.9,139 కోట్లు మాత్రమే చూపటం ఏంటని ప్రశ్నించారు. బడ్జెట్‌లో అంకెలు చూస్తే అబ్బో అనేలా ఉన్నాయని, నిధులు విడుదల చేసేప్పుడు ఆయా శాఖలు అబ్బో అనేలా ఉంటాయా, అబ్బే అనేలా ఉంటాయా చూడాలన్నారు.
చదవండి:
కేసీఆర్ చాణక్యం: టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన అంశాలివే..
కేటీఆర్‌తో గంటా భేటీ
Comments
Please login to add a commentAdd a comment