
సాక్షి, హైదరాబాద్: నగరంలో 40 ఎకరాలు అమ్మితే రూ.2వేల కోట్లు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కబ్జాలకు గురయ్యే అవకాశమున్నచోటే భూములు విక్రయిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూములు అమ్మిన డబ్బులు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. కొందరు సన్నాసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత బీమా పథకం రెండు, మూడు నెలల్లో అమలు చేస్తామన్నారు. ధరణి ఒక విప్లవం... రైతుల బాధలు తొలగిపోయాయని పేర్కొన్నారు.
ముగిసిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నీటివాటాపై లోక్‌సభ, రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment