
సాక్షి, హైదరాబాద్: ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శించి వారిలో ధైర్యం నింపడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం వరంగల్ వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు హన్మకొండ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా టీఆర్‌ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్తారు. 11.45 గంటలకు వరంగల్ కేంద్ర కారాగారం సందర్శించి అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం ఒంటి గంటకు తిరిగి లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుని అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శిస్తారు. అక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్ –19 రోగులతో మాట్లాడి, వారిలో మనోధైర్యం నింపుతారు. అక్కడ కల్పిస్తున్న సదుపాయాలు అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment