58.3 శాతం పూర్తయిన ఇంటింటి కుటుంబ సర్వే
87.1 శాతంతో మొదటి స్థానంలో ములుగు జిల్లా
38.3%తో చిట్ట చివరన గ్రేటర్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఇప్పటివరకు 58.3 శాతం పూర్తయింది. ఈ నెల 6వ తేదీన సర్వే ప్రారంభం కాగా... తొలి మూడు రోజులు ఇళ్ల గుర్తింపు, స్టికర్లు అంటించే కార్యక్రమం నిర్వహించారు. 9వ తేదీ నుంచి కుటుంబాల వివరాలు సేకరించి నమోదుచేసే ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,16,14,349 ఇళ్లను గుర్తించగా, ఆదివారం సాయంత్రానికి 67,72,246 ఇళ్లలో సర్వే ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సర్వేలో 87,807 మంది ఎన్యుమరేటర్లు, 8,788 మంది పర్యవేక్షకులు పాల్గొంటున్నారు.
సర్వేలో కీలకాంశాలు..
⇒ సర్వేలో భాగంగా గుర్తించిన మొత్తం ఇళ్లు: 1,16,14,349. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 64,41,183, పట్టణ ప్రాంతంలో 51,73,166 ఇళ్లు ఉన్నాయి.
⇒ రాష్ట్రాన్ని 92,901 బ్లాకులుగా విభజించారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 52,493, పట్టణ ప్రాంతంలో 40,408 బ్లాకులున్నాయి.
⇒ సర్వేలో 87,807 మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో 47,561 మంది, పట్టణ ప్రాంతంలో 40,246 మంది ప్రజల వివరాలు సేకరిస్తున్నారు.
⇒ సర్వే తీరును సమన్వయం చేసేందుకు 8,788 మంది పర్యవేక్షకులను ప్రభుత్వం నియమించింది. ఇందులో 4,947 మంది గ్రామాల్లో, 3,841 మంది పట్టణ ప్రాంతంలో ఉన్నారు.
⇒ ఆదివారం నాటికి ములుగు జిల్లాలో అత్యధికంగా 87.1 శాతం సర్వే పూర్తయింది. ఆ తర్వాత స్థానంలో నల్లగొండ జిల్లా 81.4 శాతం, జనగామ 77.6 శాతం, మంచిర్యాల 74.8 శాతం, పెద్దపల్లి జిల్లాలో 74.3 శాతం సర్వే పూర్తయింది. అత్యధిక జనసాంద్రత ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఇప్పటివరకు 38.3 శాతం మాత్రమే పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment