
పులుకుర్తి సమీపంలో ఎగసిపడుతున్న దేవాదుల నీరు
దామెర: దేవాదుల పైప్‌లైన్ లీకేజీతో ఒక్కసారిగా నీరు నింగిని తాకే విధంగా పైకి ఎగజిమ్మింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పులుకుర్తిలోని దేవాదుల పంప్ హౌజ్ నుంచి భీంఘన్‌పూర్ పంప్‌హౌజ్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పులుకుర్తి శివారులో శనివారం ఉదయం గేట్‌వాల్వ్ లీకేజీ కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరు ఎగిసిపడింది.
దీంతో సమీపప్రాంతం మొత్తం జలమయమైంది. పులుకుర్తి గ్రామానికి చెందిన రైతు పండుగ రవి తన రెండెకరాల పొలంలో ఇటీవల నాట్లు వేయగా పొలం పూర్తిగా మునిగిపోయింది. లీకేజీ విషయమై సంబంధిత అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ పైప్‌లైన్ లీకేజీతో రెండెకరాల పత్తి పూర్తిగా మునిగి నష్టం వాటిల్లిందని రవి వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment