
సాక్షి, మహబూబ్‌నగర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల ఎల్లూరు వద్ద నీట మునిగిన కేఎల్ఐ ప్రాజెక్టు మోటర్లను పరిశీలించడానికి వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను వనపర్తి జిల్లా పెబ్బేర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు పార్టీ కార్యకర్తలకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో అరుణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. మంత్రులను అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం పెబ్బేరులో ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్నాయి. అరుణతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment