ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు | ECIL Recruitment 2021: Apply Online for Technical Officer Posts | Sakshi
Sakshi News home page

ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

Published Fri, Feb 12 2021 6:46 PM | Last Updated on Fri, Feb 12 2021 6:56 PM

ECIL Recruitment 2021: Apply Online for Technical Officer Posts - Sakshi

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈసీఐఎల్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, ఈవీఎం, వీవీపాట్‌ కమిషనింగ్‌ పనుల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు సైట్‌లలో పనిచేయడానికి 6 నెలల ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 650

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇనుస్ట్రు మెంటేషన్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది పోస్టు క్వాలిఫికేషన్‌ ఇండస్ట్రియల్‌ అనుభవం ఉండాలి.

వయసు: 31.01.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌(బీఈ/ బీటెక్‌ మార్కులు), అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 15.02.2021

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/

చదవండి:
జీ మ్యాట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలో మరో విభాగం

పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement