హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 09
► పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్–08, సైంటిఫిక్ అసిస్టెంట్–01.
► టెక్నికల్ ఆఫీసర్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 31.01.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.23,000 చెల్లిస్తారు.
► సైంటిఫిక్ అసిస్టెంట్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ /ఇన్‌స్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 31.01.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.20,202 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు బీఈ/బీటెక్ మార్కులు, ఏడాది పని అనుభవం ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను వర్చువల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు డిప్లొమా మార్కులు, ఏడాది పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021
► వెబ్‌సైట్: www.ecil.co.in
ఈసీఐఎల్‌లో వివిధ ఖాళీలు
Published Thu, Mar 18 2021 4:28 PM | Last Updated on Thu, Mar 18 2021 6:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment