నవమి నాటికి తేలకపోతే.. సజీవ సమాధి | Ex-DSP Nalini Sensational Comments On CM Revanth Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

నవమి నాటికి తేలకపోతే.. సజీవ సమాధి

Sep 27 2025 7:00 AM | Updated on Sep 27 2025 11:56 AM

Ex-DSP Nalini Sensational Comments on CM Revanth Reddy

నా చావుకు సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత  

మాజీ డీఎస్పీ దోమకొండ నళిని  

 సాక్షి, యాదాద్రి: మాజీ డీఎస్పీ దోమకొండ నళిని శుక్ర­వారం ఫేస్‌బుక్‌లో మరో ప్రకటన పోస్టు చేశారు. ఇది తన మరణ వాంగ్మూలంగా ఆమె పేర్కొ­న్నారు. నవమి నాటికి తన సరీ్వస్‌ సమస్యలు సీఎం రేవంత్‌రెడ్డి తేల్చకపోతే సజీవ సమాధి అవుతానన్నారు. ‘చాలామంది అభిమానులు నా జబ్బును ట్రీట్‌ చేస్తామని నన్ను సంప్ర­దిస్తున్నారు. 

వారికి ధన్యవాదాలు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అనేది ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌లో అత్యంత ప్రమాదకరమైంది. అలోపతిలో దీనికి స్టెరాయిడ్స్‌ వాడతారు. ఎక్కువ కాలం ఇవి వాడితే కాళ్లు, చేతులు వంక­ర్లుపోతాయి. అందుకే నేను ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ఆయుర్వేదం, పంచకర్మ, యోగ, యజ్ఞం వంటి వాటిని ఎంచుకున్నాను. కాబట్టే ఎనిమిదేళ్లయినా అంగవైకల్యం రాకుండా కాపాడుకున్నాను. నా­కు ఈ వ్యాధి తీవ్రస్థాయిలో రావ­డానికి నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణం. 

రాష్ట్రపతి మెడల్‌ లక్ష్యంగా డైనమిక్‌ ఆఫీసర్‌గా పనిచేసిన నన్ను సస్పెండ్‌ చేయడం, వెంటా­డి వేటాడటం నా అన్ని సమస్యలకు మూల కారణం. 21నెలల క్రితం నేనిచి్చన రిపోర్ట్‌పై ఇంకా చర్య తీసుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి నిర్లిప్తంగా ఉన్నారు. ఇది నన్ను మరింత ఒత్తిగికి గురిచేస్తోంది. ఇదే నా చావు­కు దారి తీస్తుందేమో! ఏ ఆఫీసర్‌నైనా సస్పెండ్‌ చేస్తే 6 నెలల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయాలి. అలా చేయకపోతే 7వ నెల నుంచి పూర్తి జీతం ఇవ్వాలి. ఈ పనిని ప్రభు­త్వం చేయలే­దు. కేసీఆర్‌ కూడా నా విషయం పట్టించుకోలేదు. నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే  సజీవ సమాధి అవుతాను’అని తన పోస్టులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement