‘అవినీతిలో నంబర్‌వన్‌ సీఎం కేసీఆర్‌’ | Ex MPP Sensational Comments On CM KCR In Karimnagar | Sakshi
Sakshi News home page

‘అవినీతిలో నంబర్‌వన్‌ సీఎం కేసీఆర్‌’

Published Fri, Jul 2 2021 11:46 AM | Last Updated on Fri, Jul 2 2021 1:16 PM

Ex MPP Sensational Comments On CM KCR In Karimnagar - Sakshi

సాక్షి, జన్నారం(కరీంనగర్‌): దేశంలోనే అవినీతిలో నంబర్‌వన్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిలుస్తారని, అవినీతి అంతం కావాలంటే రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పైడిపల్లి ఫంక్షన్‌ హాలులో రాథోడ్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో బీజేపీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం కేసీఆర్‌కు దళితులపై ప్రే పుట్టుకొచ్చిందని విమర్శించారు. 45 వేల మంది దళితుల ఓట్ల కోసం కపట ప్రేమ నటిస్తున్నారని పేర్కొన్నారు.

జన్నారం మండలం కవ్వాల్, కలమడుగు, రోటిగూడ, చింతలపల్లి, పొనకల్, చింతగూడ, తదితర గ్రామాలకు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు, సర్పంచు, వర్గక సంఘం అధ్యక్షుడు మారుతితోపాటు సుమారు 500 మంది మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. వివేక్‌ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు వెర్రబెల్లి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, జిల్లా ఇన్‌చార్జి పల్లె గంగాధర్, జన్నారం మండల ఇన్‌చార్జి తుల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గోలి చందు, ప్రధాన కార్యదర్శి ఎరుకల రమేశ్‌గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మహేశ్, తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: సాక్షి కథనం: మానవత్వం చాటుకున్న మెజిస్ట్రేట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement