
సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం ఆ రైతు కుటంబం కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నిస్తుండగా వెంటనే ఆప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆ కుటంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను శామీర్‌పేటకు చెందిన దంపతులు భిక్షపతి, బుచ్చమ్మగా పోలీసులు గుర్తించారు. భూ వివాదంలో తమకు అన్యాయం చేస్తున్నారని రైతు కుటుంబం ఆవేదన చేసింది. శామీర్‌పేట్ మండలం కొత్తూరులో 1.30 గుంటల భూమిని ఇన్‌స్పెక్టర్ సంతోష్ వేరే వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని రైతు భిక్షపతి తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ఇన్‌స్పెక్టర్ వేధింపులే కారణమని రైతు కుటుంబం ఆరోపించింది. చదవండి: ఈ వయసులో పెళ్లి సరి కాదన్నందుకు..
Comments
Please login to add a commentAdd a comment