16 నుంచి ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు.. | Final Semester Exams From 16 In Telangana | Sakshi
Sakshi News home page

16 నుంచి ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు..

Published Wed, Sep 2 2020 2:20 AM | Last Updated on Wed, Sep 2 2020 2:20 AM

Final Semester Exams From 16 In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షల (రెగ్యులర్‌/సప్లిమెంటరీ) తేదీలు ఖరారయ్యాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రెండో సెమిస్టర్‌ పరీక్షలను తాజాగా ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించాలని  జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయిం చింది. ఇందుకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. బీటెక్, బీ ఫార్మసీలో ఆర్‌09, ఆర్‌13, ఆర్‌15, ఆర్‌16 సబ్జెక్టుల విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. సెమిస్టర్‌ పరీక్షలను రోజుకు రెండు చొప్పున నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో పరీక్ష నిర్వహిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement