జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం | Fire Accident At Jeedimetla Industrial Area Kopalle Pharma Factory | Sakshi
Sakshi News home page

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. భయం గుప్పిట్లో అపార్ట్‌మెంట్‌ వాసులు

Published Thu, Mar 16 2023 8:57 PM | Last Updated on Thu, Mar 16 2023 9:01 PM

Fire Accident At Jeedimetla Industrial Area Kopalle Pharma Factory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోపల్లె ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ పరిశ్రమ మూతపడి ఉన్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే.. గురువారం నాటి పేలుడు ధాటికి పరిశ్రమలో ఒక్కొక్కటిగా సాల్వెంట్‌ డ్రమ్‌లు పేలిపోతున్నాయి. ఆ శబ్ధాల ధాటికి పక్కనే ఉ‍న్న అపార్ట్‌మెంట్‌ వాసులు భయపడిపోతున్నారు. ఘటనా స్థలానికి కాస్త ఆలస్యంగా చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. మంటలు ఆర్పే పనిలో ఉన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement