
సాక్షి, హైదరాబాద్: తూర్పు నావికాదళం విభాగాధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తీరప్రాంతాల రక్షణకు తూర్పు నావికాదళం సంసిద్ధతతో పాటు వచ్చే ఏడాది నిర్వహించనున్న నావికా విన్యాసాలకు ఏర్పాట్ల గురించి ఆయన గవర్నర్‌కు వివరించారు.
కరోనా మహమ్మారి సమయంలో ఇతర దేశాల నుంచి ఆక్సిజన్‌ను సమీకరించడంలో నావికాదళం చేసిన సేవలను ఈ సందర్భంగా తమిళిసై కొనియాడారు. భేటీలో నేవీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు ప్రాంత అధ్యక్షురాలు చారు సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment