నిజామాబాద్ జిల్లా ఎత్తొండలో వడగళ్ల వాన
కోటగిరి/రుద్రూర్ (బోధన్): నిజామాబాద్ జిల్లా కోటగిరి, రుద్రూర్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో బుధవారం రాత్రి 8.30 నుంచి గంట పాటు వడగళ్ల వాన జోరుగా కురిసింది. కోటగిరి మినహా మండలంలోని హెగ్డోలి, ఎత్తొండ, వల్లభాపూర్, యాద్గార్ పూర్, కొల్లూర్ గ్రామాలతో పాటు రుద్రూర్ మండల కేంద్రంలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. యాసంగిలో వేసిన సూర్యకాంతం పూలు, మొక్కజొన్న, గోధుమ పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment