తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను ఆమోదించాలని జూన్ 8న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మండల తహశీల్దార్ కార్యాలయంలో గతంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఇప్పుడు వాటిని ఆమోదించారో లేదా అనేది ఎలా చూడాలో చాలామంది ప్రజలకి తెలియదు. సాదారణంగా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు వాటిని అప్రూవ్ చేశారా లేదా అని మీ సేవ కేంద్రానికి వెళ్లి చూసుకుంటారు. కానీ,ఇక నుంచి మీకు ఆ అవసరం లేదు. మీరు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఇంట్లో నుంచో తెలుసుకోవచ్చు. అదే ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం..
- మొదట మీరు ఈపిడీస్ తెలంగాణ(https://epds.telangana.gov.in/FoodSecurityAct/) పోర్టల్ ఓపెన్ చేయాలి.
- ఇప్పుడు వెబ్ సైట్ ఓపెన్ చేశాక, ఎఫ్ ఎస్ సీ సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- మీకు కనిపించే రేషన్ కార్డు సర్చ్ లో ఎఫ్ఎస్ సీ సర్చ్, ఎఫ్ఎస్ సీ అప్లికేషన్ సర్చ్ అనే రెండు కేటగిరీలు ఉంటాయి.
- ఇందులో ఎఫ్ఎస్ సీ అప్లికేషన్ సర్చ్ అనే దానిమీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ జిల్లాను ఎంచుకొని, పక్కనే ఉన్న దానిలో మీ సేవ నెంబర్ (లేదా) మొబైల్ నెంబర్ (లేదా) అప్లికేషన్ నెంబర్ సహయంతో సర్చ్ చేయండి.
- ఇప్పుడు మీ రేషన్ కార్డు దరఖాస్తును ఆమోదించారో లేదా అనేది మీకు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment