విలేకరులతో మాట్లాడుతున్న నీలిస్వాఎన్కాని
రాయదుర్గం: దక్షిణాఫ్రికా టూరిజానికి మూడవ అతిపెద్ద భారతీయ సోర్స్ మార్కెట్‌గా హైదరాబాద్ నగరం ఆవిర్భవించిందని దక్షిణాఫ్రికా టూరిజమ్ ఎంఈఐఎస్‌ఈఏ హబ్ హెడ్ నీలిస్వాఎన్కాని పేర్కొన్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని షరటాన్ హోటల్‌లో దక్షిణాఫ్రికా టూరిజమ్ వార్షిక రోడ్‌షో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ వరకు దాదాపు 50వేల మంది భారతీయులు దక్షిణాఫ్రికాకు పర్యటించడానికి వచ్చారని గుర్తు చేశారు. 33,900 మంది సందర్శకులను తీసుకరావాలనే లక్ష్యాన్ని అధిగమించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 13 నుంచి 16వ తేదీ వరకు భారత్‌లోని ప్రధాన నగరాలైన కోల్‌కతా, చెన్నయ్, హైదరాబాద్ ముంబాయి నగరాల్లో రోడ్ షోలను నిర్వహిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment