రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణంకంటే 2 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగత్రలు
జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
వచ్చే 3 రోజులపాటు మరింత పెరగనున్న ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని రోజులుగా చల్లబడ్డ వాతావరణం కాస్తా మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంపై సూరీడు సుర్రుమంటూ విరుచుకుపడ్డాడు. తెలంగాణను నిప్పుల కుంపటిలా మార్చాడు. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
అలాగే మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 44.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
26న బంగ్లాదేశ్‌లో తీరం దాటనున్న తుపాను
పశి్చమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదిలి శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్‌లోని ఖేర్పురకు దక్షిణ నైరుతి దిశలో 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈ వాయుగుండం ఈశాన్య దిశలోనే కదులుతూ మరింత బలపడి శనివారం ఉదయానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు తెలిపింది.
క్రమంగా ఉత్తర దిక్కులో కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఈ నెల 26న అర్ధరాత్రికల్లా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలోని సాగర్ ఐలాండ్ ఖేర్పుర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావం ఉత్తర తెలంగాణ ప్రాంతంపై అతితక్కువగా ఉంటుందని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరమధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం ప్రధాన కేంద్రాల్లో గరిష్ట
ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం
ఆదిలాబాద్ 42.8
మహబూబ్‌నగర్ 41.5
రామగుండం 41.4
నల్లగొండ 40.5
మెదక్ 40.2
హైదరాబాద్ 39.7
ఖమ్మం 39.4
నిజామాబాద్ 39.3
భద్రాచలం 37.0
హనుమకొండ 36.8
Comments
Please login to add a commentAdd a comment