సాధారణం కంటే అధికంగా 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు
జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో అత్యధికంగా 44.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
మహబూబ్‌నగర్‌లో అత్యల్పంగా 25.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. శనివారం నిర్మల్ జిల్లా కుబీర్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 44.9 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లా డోంగ్లి 44.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 44.7 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ జిల్లా వయల్పూర్ 44.6 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా నమోదయ్యే అవకాశముందని వివరించింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే....గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 44.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో 25.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదైంది.
తీవ్ర వాయుగుండంగా మారిన వాయుగుండం
మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు తెలిపింది.
శనివారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లలో)
కేంద్రం గరిష్టం
అదిలాబాద్ 44.0
మెదక్ 42.7
నిజామాబాద్ 42.4
హైదరాబాద్ 39.9
హకీంపేట్ 39.8
నల్లగొండ 39.5
దుండిగల్ 39.5
రామగుండం 38.8
హనుమకొండ 38.0
మహబూబ్‌నగర్ 37.5
ఖమ్మం 36.0
భద్రాచలం 31.6
Comments
Please login to add a commentAdd a comment