ఫ్రెండ్‌ మాట్లాడటం లేదని ఓ యువతి.. | Karimnagar Young Woman Attempts Suicide Due To Her Friend Is Not Talking | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్‌ మాట్లాడటం లేదని ఓ యువతి ఆత్మహత్యాయత్నం

Published Thu, Nov 19 2020 8:36 PM | Last Updated on Thu, Nov 19 2020 8:38 PM

Karimnagar Young Woman Attempts Suicide Due To Her Friend Is Not Talking - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : స్నేహానికన్న మిన్నా, ఈ లోకాన లేదురా అనే సినిమా పాటను ఒంట పట్టించుకున్న ఓ యువతి, స్నేహితుడు దూరం కావడంతో ఆత్మహత్యకు యత్నించింది. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ వద్ద సెల్పీ తీసుకుంటు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా లేక్ పోలీసులు  ఆమెను కాపాడారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుండగా అక్కడే పని చేసే యువకుడితో సన్నిహితంగా మెదిలి మంచి మిత్రులు గా మారారు.

అయితే ఆ యువకుడు ఇటీవల ఆమెతో మాట్లాడకుండా దూరంగా ఉండడంతో ఎడబాటును తట్టుకోలేకపోయింది. స్నేహితుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో మంచి మిత్రుడు దూరమయ్యాడనే మనస్థాపంతో డ్యాం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. డ్యాం వద్ద లేక్ పోలీసులు ఆ యువతిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంచి మిత్రుడు దూరం అయ్యాడనే బాధతో ఆత్మహత్యకు యత్నించినట్లు యువతి తెలిపారు. తనకు ఏ సమస్య లేదని, మిత్రుడు దూరమై తనతో మాట్లాడ లేకపోవడంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement