ఖమ్మం అర్బన్: ఖమ్మం 10వ డివిజన్ కార్పొరేటర్ చావ మాధురినారాయణరావుకు పశుపోషణ, వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. అందుకే ఆయన ఏ పదవిలో ఉన్నా వ్యవసాయాన్ని మాత్రం వీడలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని చక్రి గ్రామంలో పుంగనూరు జాతికి చెందిన ఆవు దూడను రూ.1.75లక్షలకు ఆయన కొనుగోలు చేశారు.
ఈ దూడ ఎత్తు రెండున్నర అడుగులు, పొడవు 4 అడుగుల వరకు ఉంది. ఈ జాతి ఆవుల పాలు, నెయ్యిని తిరుమలలో పూజలకు వినియోగిస్తారని మాధురినారాయణరావు తెలిపారు. కాగా, ఖరీదైన దూడను చూసేందుకు స్థానిక రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
వింత చేప...
ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ పడమర కోటలో ఓ వింత చేప వలలో చిక్కింది. మంగళవారం ఉదయం పడమరకోటకు చెందిన నలిగంటి హలిసన్ పొలం వద్ద వేసిన వలకు ఓ చేప చిక్కింది. సుమారు అరకిలో బరువు ఉన్న ఈ చేప పొలుసుల వెంట మొత్తం ముళ్లు ఉన్నాయి. చేపను స్థానికులు ఆసక్తిగా గమనించారు.
రెండు తలలతో గొర్రె పిల్ల
జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మంగళవారం రెండు తలలు, నాలుగు కళ్లతో గొర్రె పిల్ల జన్మించింది. మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్‌కు చెందిన మందలోని ఓ గొర్రె ఈ పిల్లను ఈనింది.
చదవండి: కో.. కో.. కోడి బాగుంది..
Comments
Please login to add a commentAdd a comment