
సాక్షి, కొత్తగూడ (వరంగల్): కరోనాతో చికిత్స పొందుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు శనివారం మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌కు చెందిన కంగాల రవి (35) మంగపేటలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో వారం రోజులుగా నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆస్పత్రి బెడ్‌పైనుంచి ఆయన సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపించారు. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా కరోనా కమ్ముకుంటుందని, ఎవరూ కూడా బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని అందులో సూచించారు. తాను పడుతున్న ఇబ్బందులు మరెవరికీ రావొద్దని కోరారు. ఇంతలోనే శనివారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో రవి మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment