Minister KTR Comments at TRS 21 Years Celebrations at Hyderabad - Sakshi
Sakshi News home page

సిలిండర్‌ వెయ్యి అయ్యింది. మహిళలకు కట్టెల పొయ్యే దిక్కయింది: కేటీఆర్‌

Published Wed, Apr 27 2022 3:40 PM | Last Updated on Thu, Apr 28 2022 7:40 AM

Minister KTR Comments At TRS 21 Years Celebrations At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘భారత దేశానికి కేసీఆర్‌ లాంటి నాయకుడు కావాలి. మేరా భారత్‌ మహాన్‌ అనే నాయకున్ని దేశం కోరుతోంది. బహుశా ఆ నాయక త్వాన్ని తెలంగాణనే అందిస్తుందేమో.. తెలం గా ణను విజయవంతంగా ముందుకు నడిపిన కేసీఆర్‌ నాయకత్వం దేశానికి కావాలి’ అని టీఆర్‌ ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం హెచ్‌ఐఐసీసీలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆయన ‘దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ కీలక భూమిక పోషించాలి’ అనే అంశంపై రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదిం చారు. ఈ ప్రతిపాదనను విద్యుత్‌శాఖ మంత్రి జగ దీశ్‌రెడ్డి బలపరిచారు.

కేటీఆర్‌ మాట్లా డుతూ.. కేసీ ఆర్‌ లాంటి టార్చ్‌ బేరర్‌ (మార్గదర్శి) దేశానికి అవ సరమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ విధానాలను తూర్పార బట్టారు. ‘ఈరోజు మోదీ అంటే.. రైతు విరోధి అని దేశం అంటోంది. నల్లధనం వెలికితీస్తానన్న ప్రధాని ఇప్పుడు తెల్లమొహం వేశారు. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు సృష్టించకపోగా.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి.. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటడంతో మహిళలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యింది’ అని పేర్కొన్నారు.

మత విద్వేషం నింపుతున్నారు..
‘మోదీ ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటూ దేశ ప్రజలు మనోనిబ్బరం కోల్పోయేలా చేస్తున్నారు. హర్‌ ఘర్‌ జల్‌ (ప్రతీ ఇంటికి తాగునీరు) అనే మోదీ.. ప్రతి ఒక్కరి మనస్సులో మత విద్వేషం అనే విషాన్ని నింపుతున్నారు’ అని కేటీఆర్‌ చెప్పారు. దేశానికి ఇప్పుడు కావాల్సింది ఉద్వేగ భారతం కాదని ఉద్యోగాల భారతమని తనదైన శైలిలో చమత్కరించారు. తలా తోక లేని దౌత్య విధానంతో ప్రపంచం ముందు మన దేశాన్ని నవ్వుల పాలు చేస్తున్నారన్నారు. అన్ని దరిద్రమైన విషయాల్లో మోదీ దేశాన్ని నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారని దుయ్యబట్టారు. మానవ అభివృద్ధి సూచీ, ఆకలి సూచీ... హ్యాపినెస్‌ ఇండెక్స్‌... మహిళా రక్షణ సూచీ వంటి అన్ని అంశాల్లో దేశ ర్యాంకులు దిగజార్చింది మోదీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. 

చదవండి👉 గవర్నర్‌ వ్యవస్థను దుర్మార్గంగా మార్చేశారు: సీఎం కేసీఆర్‌


తెలంగాణ విజయాలు పట్టవా

లోకల్‌ ఫర్‌ వోకల్‌ అనే మోదీ.. తెలంగాణ సాధించిన విజయాలను, కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్క మాటా చెప్పరని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ విజయాలు దేశం విజ యా లు కావా.. ఆయన మనసులో మన విజ యా లకు స్థానం లేదా? సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ కాదు.. కేంద్రంలో విద్వేషం 4 పాదాలపై నడు స్తోంది. ప్రస్తుతం దేశానికి బుల్డోజర్‌ మోడల్‌.. బిల్డప్‌ మోడల్‌.. గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ కాదు.. తెలంగాణ మోడల్‌ కావాలి. బంగారు తెలంగాణ మోడల్‌ను పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు బీజేపీ నాయకత్వంలోని బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, యూపీ) రాష్ట్రాలకు పోతున్నాయి.

మత పిచ్చి, కుల పిచ్చి లేని.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడా లన్న విశ్వమానవ సౌభ్రాతృ త్వమే తెలంగాణ మోడల్‌. స్వర్గీయ ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టిస్తే, కేసీఆర్‌ చరిత్రతోపాటు రాష్ట్రాన్ని సృష్టించారు. ఇతర రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే ఉండగా.. రాష్ట్రాన్ని తెచ్చిన వారే మనకు సీఎంగా ఉన్నారు’ అని కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన కేసీఆర్‌ జన్మధన్యమని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మాటలను కేటీఆర్‌ గుర్తుచేశారు. ఈతీర్మానాన్ని బలపరిచిన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి కేసీఆర్‌ లాంటి లీడర్‌ కావాలన్నారు. 

అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులందరికీ మంత్రి కేటీఆర్‌ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామం వార్డుల్లో, బస్తీల్లో ఉత్సాహంగా పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. విజయవంతంగా ముగిసిన పార్టీ ప్లీనరీ సమావేశంలో మన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చేసిన దిశానిర్దేశం మేరకు పార్టీని ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులకు విజ్ఞప్తిచేశారు.   

చదవండి👉అన్నీ ఉన్నా దేశంలో దారిద్య్రం ఎందుకు?: సీఎం కేసీఆర్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement