మిషన్‌ భగీరథ పైపులైన్‌ను ఢీకొట్టిన లారీ | Mission Bhagiratha pipeline bursts in Telangana | Sakshi
Sakshi News home page

మిషన్‌ భగీరథ పైపులైన్‌ను ఢీకొట్టిన లారీ

Published Fri, Sep 10 2021 3:17 AM | Last Updated on Sat, Sep 11 2021 7:59 AM

Mission Bhagiratha pipeline bursts in Telangana  - Sakshi

మిషన్‌ భగీరథ పైపులైన్‌ను లారీ ఢీకొన్న ఘటనలో నీరు భారీగా ఎగసిపడింది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఈద్గామ్‌ చౌరస్తా నుంచి భైంసా వెళ్లే మార్గంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ వద్ద నిలిపి ఉన్న లారీని, భైంసా నుంచి వస్తున్న టిప్పర్‌ వెనకనుంచి ఢీకొట్టింది.

ఈ క్రమంలో లారీ ముందు భాగం పైపును ఢీకొట్టడంతో ఒక్కసారిగా నీరు ఎగసిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో టిప్పర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అక్కడికి చేరుకుని త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

– నిర్మల్‌ చైన్‌గేట్‌  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement