జఫర్‌గఢ్: కరోనా బారినపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ సర్పంచ్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే టి.రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాడె మోయడంతో పాటు చితిపేర్చే కార్యక్రమాలన్నీ దగ్గర ఉండి నిర్వర్తించారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం కూనూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చౌదరిపల్లి మల్లయ్య (50) కరోనాతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.
మృతదేహాన్ని కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో గ్రామ శ్మశానవాటిక వద్దకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలా గే, దగ్గరుండి అంత్యక్రియల క్రతువు పూర్తి చేయించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వారి విషయంలో అపోహలు వీడాలని సూచించారు.
చదవండి: పెళ్లి వేడుక: కట్టించాల్సిన తాళి కొట్టేశాడు
Comments
Please login to add a commentAdd a comment