
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించదని గురువారం ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారని చెప్పారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. అత్యాచారానికి గురైన బాధితురాలికి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment